ఆపన్నహస్తం అందించి.. ఆకలి తీర్చే అన్నపూర్ణలుగా గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలు ప్రసిద్ధి చెందాయి. రాష్ట్ర ధాన్యరాశుల భాండాగారాలుగా వాసికెక్కాయి. సాగు, తాగు నీటితో.. పచ్చని పంట చేలతో అలరారే డెల్టాలకు.. క్షారరూపంలో ప్రమాదం పొంచి ఉంది. సారవంతమైన డెల్టా భూములు.. చౌడుబారి ఎడారులుగా మారనున్నాయి. ధాన్యరాశులు కుమ్మరించిన వరిపొలాల్లో గడ్డిమొలక సైతం మొలవని స్థితి దాపురించనుంది. వేగంగా విస్తరిస్తున్న ఉప్పునీటి ముప్పు.. డెల్టాల భవిష్యత్ ను అంధకారం చేయనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా డెల్టాలపై ఆధారపడి జీవిస్తున్న కోట్ల మంది ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మానవ తప్పిదాలు ప్రధాన కారణం కాగా.. ప్రకృతి వైపరీత్యాలు తోడ్పాటు అందిస్తున్నాయి. స్వయాన ప్రధాన మంత్రికి ఇచ్చిన నివేదికలో కేంద్ర జలసంఘం పేర్కొన్న కఠోర వాస్తవాలివి. మేల్కోకపోతే డెల్టాలో పంటలుపండే పరిస్థితి ఉండదని హెచ్చరికలు సైతం జారీచేసింది.
0 Comments